ఎంత కఠినంగా ఉన్నాయో : పంచాయతీ ఎన్నికల్లో పోటీ అర్హత, రూల్స్ ఇవే

ballot-boxత్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో.. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరిస్తూ పలు నిబంధనలతో కూడిన బుక్ లెట్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఐపీ పెట్టినా, ఐపీకి దరఖాస్తు చేసుకున్నా.. ఆర్థికంగా దివాళా తీసి అప్పుల నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నట్టు కోర్టు నిర్ధారించినా.. అలాంటి వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హులని నిర్ణయించింది. ఏకగ్రీవం కోసం వేలంవేసినా.. ఓటర్లను కొనుగోలుచేసినా.. జైలుశిక్షతోపాటు జరిమానా, అనర్హత వేటుకు గురయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

విచారణ చేపట్టిన తర్వాతనే ఏకగ్రీవమైన పంచాయతీలను ప్రకటించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధన విధించారు. మతిస్థిమితం సరిగాలేనివారు, చెవిటి, మూగ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండేందుకు అనర్హులు. క్రిమినల్ శిక్షపడిన వారికి పోటీచేసే అర్హత ఉండదు. శిక్ష ముగిసిన తర్వాత  ఐదేళ్లు  స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకట్ట వేసేలా నిబంధనలు తీసుకొచ్చారు. అభ్యర్థులను బెదిరించినా, ఎత్తుకెళ్లినా ఏడాది జైలుశిక్ష విధించడంతోపాటు ఆరేళ్లు నిషేధం విధిస్తూ కఠిన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు. నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలుంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది.

Posted in Uncategorized

Latest Updates