ఎంత డేర్ లేడీ : పెళ్లి కొడుకు ఉలిక్కిపడ్డాడు.. తాళి విసిరికొట్టింది

thunderపెద్ద పెళ్లి మంటపం.. బంధువులతో కళకళలాడుతోంది. పెళ్లి కొడుకు కూడా హ్యాపీ. పెళ్లి కూతురు కూడా మరికొన్ని నిమిషాల్లో తాళి కట్టించుకోబోతున్నది. ఇది సీన్ రివర్స్ అయ్యింది. ఈ పెళ్లి వద్దంటూ అడ్డం తిరిగింది.. పీటల పైనుంచి లేచి వెళ్లిపోయింది. అందరూ షాక్.. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రం శరన్ జిల్లా చిత్రసేన్ పూర్ గ్రామం. సోనేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది ఆ గ్రామం. జూన్ 28వ తేదీ గురువారం సాయంత్రం. రెండు కుటుంబాల పెద్దలు, బంధువులతో కళకళలాడుతోంది. ఓ వైపు పెళ్లి హడావిడి, మరో వైపు విందు, వినోదాలు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ సమయంలో గాలి దుమారం. వర్షం ప్రారంభం అయ్యింది.

సరిగ్గా ఇక్కడే పెళ్లి వేడుక రసాభాస అయ్యింది. వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. పెద్ద పెద్ద శబ్దాలు. ఈ పిడుగుల శబ్దాలకు పెళ్లి పీటలపై ఉన్న వరుడు భయపడ్డాడు. దీన్ని పక్కనే ఉండి గమనించిన పెళ్లి కుమార్తె.. పీటలపై నుంచి లేచింది. ఈ పెళ్లి వద్దని చెప్పింది. తాళి విసిరేసింది. ఎందుకు అంటే.. పిడుగులు పడితేనే ఇలా భయపడుతున్నాడు.. ఇక నన్నేం చూసుకుంటాడు.. సంసారం జీవితాన్ని ఎలా నెట్టుకొస్తాడు అని సగర్వంగా వేదికపై నుంచే ప్రకటించేసింది. అంతా షాక్. పెళ్లి కుమార్తెకు సర్దిచెప్పటానికి ప్రయత్నించారు. అయినా ఆ యువతి వినలేదు. దీంతో రెండు కుటుంబాలతోపాటు బంధువులు కొట్టుకున్నారు. అవమానంతో తిట్టుకున్నారు. పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీస్ స్టేషన్ లో పెళ్లి కుమార్తెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అబ్బే వినలేదు. అందులోనూ యువతి మేజర్. బలవంతం చేయటం నేరం అనే సంగతి బాగా తెలిసిన పోలీసులు.. మీ ఇష్టం అని వదిలేశారు. పెద్దలు రంగంలోకి దిగారు. అయినా ఫలితం లేదు. పెళ్లి ఆగిపోయింది. వర్షం కూడా తగ్గింది. పిడుగులు కూడా ఆగిపోయాయి. వీటితోపాటు ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. మొత్తానికి పిడుగులు.. ఆ పెళ్లిని నాశనం చేయటానికే వచ్చాయంటూ బంధువులు అందరూ తిట్టుకుంటూ వెళ్లిపోయారు.. ఇదీ పిడుగులు – పెళ్లికి మధ్య ఉన్న స్టోరీ..

 

Posted in Uncategorized

Latest Updates