ఎంత దారుణం: కన్నతల్లినే ట్రాక్టర్ కిందకు తోశాడు

MOTHERసాకేంతికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాదిస్తూ ముందుకు దూస్కెళ్తుంటే …మరోవైపు బంధాలు, బంధుత్వాలు మరిచిపోతున్నారు కొందరు. అంతేకాదు.. మానవత్వాన్ని మంట గలుపుతున్నారు. ముఖ్యంగా మహిళలపై అఘత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కన్న వారిపైనే కన్నబిడ్డలు దాడులకు పాల్పడుతున్నారు.

నవమాసాలు మోసి..కని పెంచిన కన్నతల్లిని కడతేర్చేందుకు యత్నించాడు ఒక ప్రభుద్దుడు. నడుస్తున్న ట్రాక్టర్ కిందకు ఆమెను తోసివేశాడు. వివాదంలో ఉన్న భూమిని ప్రత్యర్థి వర్గం ట్రాక్టర్ తో దున్నుకోకుండా ఆ కొడుకు ఇంతటి దారుణాకి ఒడిగట్టాడు. ఈ ఘటన మహారాష్ట్ర లోని వాసిమ్ గ్రామంలో జరిగింది.

గ్రామంలో ఒక వ్యక్తికీ భూవివాదాలు చోటుచేసుకున్నాయి .దీంతో దీనిపై ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు .అయితే కోర్టు ఆ భూమి వేరే వ్యక్తికీ చెల్లుతుందని తీర్పునిచ్చింది .దీంతో కేసులో ఓడిపోయాను అనే కోపంతో …కేసులో గెలిచిన వ్యక్తి ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా వెళ్లి మరి గొడవ పెట్టుకున్నాడు .అంతే కాకుండా పొలం దున్న కుండా ఉండేందుకు ఏకంగా తన తల్లినే ట్రాక్టర్ కిందకు నెట్టాడు ఆ కొడుకు. దీంతో 80 ఏళ్ల వయస్సున్న ఆ తల్లి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.తల్లిని ట్రాక్టర్ కింద పడేసే కంటే తనే పడిపోతే బాగుండేది అని నెటిజన్లు కామెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates