ఎంత నరకం అనుభవించాడో : తాటిచెట్టుపైనే ఊపిరి ఆగింది

TATIబతుకుదెరువు కోసం కల్లుగీతను ఎంచుకున్నాడు. రోజూ  మోకు ముస్తాదుతో తాటి చెట్టు ఎక్కి కల్లుగీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఆ గీత కార్మికుడు. రోజు వారీగానే గురువారం(జూన్-7) తాటి చెట్టు ఎక్కాడు.  పైన ఉండగానే గుండెపోటు వచ్చింది. ఈ విషాదం మహబూబ్ బాద్ జిల్లా గూడూరులో జరిగింది. 41 ఏళ్ల రాంపల్లి సాంబయ్య గురువారం ఉదయం 9 గంటలకు కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.

కిందకు దిగలేడు.. కింద ఉన్న వారికి ఏం జరుగుతుందో తెలియదు.. దీంతో సకాలంలో వైద్యం అందక చెట్టుపైనే చివరి శ్వాస వదిలాడు. కాళ్లకు ఉన్న మోకుతో అలాగే వేలాడుతుండగా.. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందిచారు. మృతుడికి భార్య మంజుల, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మృతదేహానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులకు 5 వేల రూపాలయల ఆర్ధిక సాయం అందజేశారు.

Posted in Uncategorized

Latest Updates