ఎంత నెమ్మదిగా తింటే..అంత స్లిమ్ గా అవుతారట

healthy-foods-to-protect-your-eyesబరువు తగ్గాలని రకరకాల వ్యాయామాలు చేస్తారు. ట్రీట్ మెంట్ తీసుకుంటారు. ఇవే కాకుండా తినే ఫుడ్ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల బరువు తగ్గవచ్చని ఇటీవల చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. నెమ్మదిగా, వేగంగా ఆహారం తినేవారు 60వేల మంది జపాన్ దేశీయులను పరిశీలించగా.. ఈ వాస్తవం వెలుగుచూసిందని చెప్పారు పరిశోధకులు. నెమ్మదిగా తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చని జపాన్ పరిశోధకులు తేల్చారు. జపాన్ దేశంలోని కియూషు యూనివర్శిటీలో పరిశోధకులు ఒబేసిటీ, ఆహారం తినే అలవాట్లపై పరిశోధనలు చేశారు. వేగంగా కాకుండా నెమ్మదిగా తింటే ఒబేసిటీ సమస్య దూరమవుతుందని తమ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు చెప్పారు. నెమ్మదిగా తిన్న 4 వేల 192 మంది బరువు తగ్గారని వివరించారు సైంటిస్ట్ సిమన్ కార్క్.

Posted in Uncategorized

Latest Updates