లూడో గేమ్ లో తండ్రి మోసం చేశాడంటూ కోర్ట్ మెట్లెక్కిన కూతరు

తాజాగా జరిగిన ఈ ఘటన నేటి తరం యువతీయువకుల మనస్తత్వాల్ని చూసి జాలి పడాలో..లేదంటే అమితంగా ఇష్ట పడే నాన్న తనని ఆటలో మోసం చేశాడని తట్టుకోలేక కోర్ట్ మెట్లెక్కిన కూతురి ప్రేమని చూసి ఆనందపడాలో అర్ధం కానీ పరిస్థితి ఇది.

కోట్లు సంపాదించినవాడిని అంబానీ అని పొగడొచ్చు. కానీ ఆడపిల్లను కన్న ప్రతి తండ్రీ అంబానీ కంటే గొప్పోడు. ఆడపిల్ల పెరిగే క్రమంలో డబ్బుతో వెలకట్టలేని ఆనందాన్ని పొందుతాడు. తండ్రి తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కూతురు కోసమే ఖర్చు పెడతాడు. ఏం కావాలి బంగారం.. అంటూ గారం చేస్తాడు. మరి అలాంటి నాన్నే తనని చీట్ చేశాడని తెలిస్తే కూతురు సహిస్తుందా..? సహించలేదు.కోర్ట్ మెట్లేక్కేస్తుంది. నాన్న నన్ను మోసం చేశాడని జడ్జ్ తో వాదిస్తుంది.

భూపాల్ కు చెందిన ఓ 24ఏళ్ల యువతి..ఫ్యామిలీ కోర్ట్ ను ఆశ్రయించింది. ఆన్ లైన్ లూడో గేమ్ లో తండ్రి తనను ఓడించడంతో తట్టుకోలేని కూతురు తనకు న్యాయం చేయాలంటూ కోర్ట్ ను కోరింది. అంతే కాదు లూడో గేమ్ లో తనని ఓడించి తరువాత తన నాన్నని నాన్న అని పిలిచేందుకు ఇష్టపడలేదని, అందుకు కారణం నాన్నపై కూతురిపై ఉన్న నమ్మకం.

ప్రపంచంలోని అన్నీ అనందాల్ని తనపై కురిపించే తండ్రి మోసం చేయడంతో తట్టుకోలేకపోయానని తెలిపింది.

అయితే కూతురికి ఎలాంటి తీర్పు ఇవ్వాలో అర్ధం కాని జడ్జ్ సదరు యువతికి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుతో కౌన్సిలర్ సరితా రజని బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చింది.

లూడో గేమ్ మీ నాన్న కోసం నువ్వు ఓడిపోయావని అనుకోవచ్చు కదా. లేదంటే కూతురిపై గెలవాలని మీ నాన్న అనుకున్నారేమో ఇలా నాలుగు సెషన్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సరిత తెలిపింది. కౌన్సెలింగ్ అనంతరం బాధితురాలు తనని నాన్నపై ఉన్న కోపాన్ని తగ్గించుకొని ప్రేమగా ఉంటానని చెప్పినట్లు కౌన్సెలర్ సరిత మీడియాకు వెల్లడించారు.

Latest Updates