ఎంత బలుపు : మహిళను కాలితో తన్నిన MPP అరెస్ట్

gopiభూవివాదంలో మహిళను కాలితో తన్నిన ఎంపీపీ ఇమ్మడిగోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో జాతీయరహదారికి సమీపంలో ఉన్న 1,125గజాల స్థలాన్ని ఎంపీపీ గోపి నుంచి గత ఏడాది గౌరారం గ్రామానికి చెందిన రాజవ్వ కొనుగోలు చేశారు. రూ.33 లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. స్థలాన్ని అప్పగించటం లేదని రాజవ్వ నిన్న(ఆదివారం, జూన్-17) ఎంపీపీ గోపీతో ఘర్షణకు దిగారు. వీరి మధ్య మాటమాట పెరగటంతో.. మహిళను ఎంపీపీ ఎగిరి కాలుతో తన్నాడు. ఆ మహిళ అల్లంతదూరం పడింది.

ఈ ఘటనపై ఆగ్రహించిన బాధితమహిళ బంధువులు ఎంపీపీ గెస్ట్ హౌస్ తాళాలు పగులగొట్టి సామన్లు బయటపడేశారు. రెండు వర్గాలు పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టుకున్నాయి. మహిళపై దాడి దృశ్యాలు మీడియాల్లో విస్తృతంగా ప్రసారం కావటంతో ఎంపీపీ తీరుపై విమర్శలు వచ్చాయి. పోలీసులు ఎంపీపీపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రకారం వారికి స్థలాన్ని అప్పగిస్తారా లేదా అనేది చూడాలి. న్యాయం కోసం బాధితులు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates