ఎంత మంచి కబురు : వారం ముందే తెలంగాణలో వర్షాలు

rains-telanganaదేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు.. మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కేరళలోని మిగిలిన ప్రాంతాలతో పాటు కోస్టల్ కర్నాటక, దక్షిణ కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అయితే జూన్ 3 నుంచి తెలంగాణలో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముందస్తు అంచనా ప్రకారం అయితే.. జూన్ 9వ తేదీకి తెలంగాణలోకి నైరుతి ప్రవేశించొచ్చని భావించారు. అయితే రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 3వ తేదీ నుంచే తెలంగాణలో రుతుపవనాల ప్రభావం మొదలవుతుందని.. వర్షాలు పడతాయని ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు.

ఈ ఏడాది సాధారణ వర్షాపాతం నమోదు అవుతుందని ప్రకటించింది ఐఎండీ. జూన్ – సెప్టెంబర్ మధ్య సాధారణ వర్షపాతం 97 శాతంగా అంచనా వేశారు అధికారులు.  దక్షిణ భారతంలో 95 శాతం, ఈశాన్య భారతంలో 93 శాతం వర్షాపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మధ్య భారతంలో 99 శాతం, వాయువ్యభారతంలో 100 శాతం వర్షాలు పడతాయని ప్రకటించింది. జూలైలో సగటున 101 శాతం, ఆగస్టులో 94 శాతం వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. రుతుపవనాల ఎంట్రీతో కేరళను తొలకరి వర్షాలు పలకరించాయి. రుతుపవానల ప్రభావంతో కోస్టల్ కర్నాటక నుంచి.. ఉత్తరభారతం వరకు అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కోస్టల్ కర్నాటకలోని ఉడిపి, మంగుళూరులో అయితే కుండపోత వర్షం పడింది. ఈ రెండు నగరాలు జలమయం అయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates