ఎంత సక్క‌గున్నావే మేకింగ్ వచ్చేసింది

MAKINGసుకుమార్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ హీరోగా నటించిన రంగస్థలం మార్చి 30న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న టీమ్..సోమవారం (మార్చి-26)న ఎంత సక్కగున్నావే మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.
శ్రీరామనవమి కానుకగా ట్విట్టర్ ద్వారా ఈ వీడియోను రిలీజ్ చేశారు మైత్రీమూవీ మేకర్స్. పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, సమంత గెటప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎంత సక్క‌గున్నావే పాట పాపులర్ అయ్యింది. అచ్ఛ తెలుగు ప‌ల్లె ప‌దాల‌తో చంద్ర‌బోస్ రాసిన ఆ పాట‌కు విశేష‌మైన ఆద‌ర‌ణ ద‌క్కింది. మ‌రో నాలుగు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్ర‌స్తుతం జోరుగా జ‌రుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates