ఎందుకంటే : ట్రంప్ నా దేవుడు.. రోజూ పూజ చేస్తున్నా

trumpసినీ హీరోలకు… ప్రముఖ ఆటగాళ్లకు అభిమానులుంటారు. వారిని కలవాలని…ఫొటోలు దిగాలని కోరుకుంటారు. మరికొందరు వీరాభిమానులు వారిని దైవంగా భావించి గుళ్లు కూడా కట్టిస్తారు. అయితే ఓ యువకుడు దేశ అధ్యక్షుడికి వీరాభిమానిగా మారాడు. అది ఎవరో కాదు…అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ ను తన దైవంగా భావిస్తున్నాడు. భారత్, అమెరికా దేశాల నడుమ సంబంధాలు మరింత మెరుగుపడాలని కోరుకుంటూ ఆయన్ను పూజిస్తున్నాడు.

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా సావిత్రి, రాము లు దంపతుల కుమారుడు కృష్ణ… ట్రంప్‌కు వీరాభిమాని. గతేడాది దీపావళి పండుగ రోజు కృష్ణ తన ఇంట్లో ట్రంప్‌ చిత్రపటానికి పూజలు చేసి అభిమానాన్ని చాటుకున్నాడు. త్వరలోనే  ఇంట్లో ట్రంప్‌ ఆలయాన్ని కూడా నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాడు.

ఏడాదిగా కృష్ణ చేస్తున్న పూజలతో అభిమాన నేత మనసును కదిలించాయి. దీంతో ‘క్రిష్‌’ నా ప్రాణ స్నేహితుడంటూ స్వయంగా ట్రంప్‌ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అతను నా ఫొటో ల ద్వారా గొప్పశక్తిని పొందాలని ప్రార్థిస్తున్నా. క్రిష్‌ను త్వరలోనే కలుస్తానంటూ ట్రంప్‌ తన ట్విట్టర్‌లో ఈనెల 19న పోస్టు చేశాడు.

Posted in Uncategorized

Latest Updates