ఎందుకు ఇలా : జమ్మూకాశ్మీర్ లో రాజకీయ సంక్షోభం.. రాష్ట్రపతి పాలనా!

amitజమ్మూ-కశ్మీర్ లో పీడీపీకి మద్దతు ఉపసంహరించుకుంది బీజేపీ. మొత్తం 87 అసెంబ్లీ స్ధానాలున్న జమ్మూ-కశ్మీర్ లో పీడీపీ కి 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 25, కాంగ్రెస్ కు 12, ఎన్ పీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటి వరకూ జమ్మూ-కశ్మీర్ లో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం కొనసాగింది. పీడీపీకి ఇప్పుడు బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశముంది. రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలు పెరిగిపోవడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ  సీఎం ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఇది ఎప్పుడో జరగవలసిందని, ఇది తాము ఊహించిన పరిణామమేనని తెలిపారు.

పీడీపీకి మద్దతు ఉపసంహరించుకోవడంపై మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ నాయకుడు రామ్ మాధవ్.. జమ్మూలో గవర్నర్ రూల్ విధించినప్పటికి కూడా టెర్రరిజంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. వ్యాలీ కోసం కేంద్రం ఏం చేయాలో అన్నీ చేసిందన్నారు. కాల్పుల విరమణపై రెండు పార్టీల మధ్య విభేధాలు ఏర్పడ్డాయన్నారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య 20కి పడిపోయింది.

Posted in Uncategorized

Latest Updates