ఎందుకు.. ఎలా చేస్తారు : శ్రీదేవి మృతదేహానికి ఎంబాల్మింగ్

sreeచనిపోయిన మూడు రోజుల తర్వాత శ్రీదేవి భౌతికకాయాన్ని అప్పగించారు దుబాయ్ పోలీసులు. ఇప్పటికే చాలా సమయం కావటంతో ఎంబాల్మింగ్ ప్రక్రియ చేయించనున్నారు. అసలు ఎంబాల్మింగ్ ఎందుకు చేస్తారు.. ఎలా చేస్తారో చూద్దాం..

మృతదేహాన్ని కొన్ని రోజులపాటు అంత్యక్రియలు చేయకుండా ఉంచాల్సిన సందర్భాల్లో ఈ ప్రక్రియ చేస్తారు. ప్రస్తుతం శ్రీదేవి భౌతికకాయం మూడు రోజులుగా మార్చురీ ఫ్రీజర్ లో ఉంచారు. ఒక్కసారి బయటకు తీసుకొచ్చి ఇండియా తరలించాంటే కొంత సమయం పడుతుంది. ఆ విధంగా చేస్తే శరీరం దెబ్బతింటుంది. అతిలోక సుందరిని చివరి చూపు అందరికీ ఉండేలా ఎంబాల్మింగ్ చేయిస్తున్నారు కుటుంబ సభ్యులు. దీని వల్ల డెడ్ బాడీ చెడిపోదు.

ఈ ప్రక్రియలో కొన్ని రసాయన ద్రావాలను ధమనుల ద్వారా శరీరంలోకి పంపిస్తారు. ఈ ద్రవాలను ఎంబాల్మింగ్ ఫ్లూయిడ్స్ అంటారు. ఫార్మాల్డిహైడ్, మెథనాల్, ఇథనాల్‌తోపాటు కొన్ని రసాయనాలను ఈ ప్రక్రియలో వాడతారు. ఎంబాల్మింగ్ ప్లూయిడ్స్ ని ఎక్కించడం వల్ల బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. దీంతో శరీరం యథావిధిగా ఉంటుంది. ఏడాది క్రితం చనిపోయిన జయలలితకి కూడా ఎంబాల్మింగ్ చేశారు. భారతదేశంలో ఈ ప్రక్రియను ప్రముఖులకు వాడుతూ ఉంటారు.. అమెరికా లాంటి దేశాల్లో ఇది కామన్. ఒక్క అమెరికాలోనే ఏడాదికి 2 కోట్ల లీటర్ల ఎంబాల్మింగ్ ఫ్లూయిడ్స్, కెమికల్స్ అమ్ముడుపోతుంటాయి.

Posted in Uncategorized

Latest Updates