ఎందుకు చంపాడో.. కేసు పెట్టం : లాలించిన చేతులే చంపాయంటే నమ్మలేకున్నాం

Twins-murdered12 ఏళ్ల కవల పిల్లలు.. మానసికంగా ఎదుగుదల లేని సృజనరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిని చంపిన మేనమామ విషయాలు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు ఆస్పత్రి దగ్గర తమ బాధ వ్యక్తం చేశారు. పిల్లల మేనమామ మల్లిఖార్జునరెడ్డి చాలా మంచోడు అని చెబుతున్నారు ఈ పిల్లల తండ్రి, బామ్మర్ది శ్రీనివాసరెడ్డి. మా కంటే ఎంతో బాగా చూసుకునేవాడని చెబుతున్నారు. 12 ఏళ్లుగా కంటికి రెప్పలా పిల్లలను చూసుకున్న మల్లిఖార్జునరెడ్డి.. ఇలా ఎలా చేశాడో కూడా అర్థం కావటం లేదన్నారు. చంపిన చేతులే.. ఇన్నాళ్లు లాలించాయని.. పిల్లలకు ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకున్నాడని కూడా చెబుతున్నాడు ఆ పిల్లల తండ్రి శ్రీనివాసరెడ్డి.

పిల్లలు మానసిక వికలాంగులు కావటం.. అక్క, బావ బాధ చూడలేక చంపినట్లు చెబుతున్నాడు మేనమామ మల్లిఖార్జునరెడ్డి. 12 ఏళ్లుగా అక్క బాధ చూడలేకపోతున్నానని.. ఎప్పటికీ పిల్లలు సాధారణ స్థితికి వచ్చే పరిస్థితి లేదని.. వారి బాధ తీర్చటం కోసమే చంపినట్లు చెబుతున్నాడు అతను. అయితే మల్లిఖార్జునరెడ్డి వాదనను కొట్టిపారేస్తున్నారు పిల్లల తండ్రితండ్రులు. ఇంతటి దుర్మార్గంగా ఎలా ఆలోచించాడో అర్థం కావటం లేదన్నారు. మా బామ్మర్ది మల్లిఖార్జునరెడ్డి చాలా మంచోడని.. అయితే పిల్లలను చంపుతాడని ఊహించలేకపోయాం అంటున్నారు హత్యకు గురైన మానసిక వికలాంగులైన కవల పిల్లల తండ్రి శ్రీనివాసరెడ్డి. అతనిదే ఇదే పెద్ద శిక్ష అని.. కేసు పెట్టినా, పెట్టకపోయినా పిల్లలు అయితే తిరిగిరారు కదా అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

చైతన్యపురిలో పిల్లల చంపి కారులోకి తీసుకెళుతున్న ద్రుశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. జూన్ 15వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మిర్యాలగూడ నుంచి పిల్లలను హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఫ్రెండ్ గదిలో పిల్లలను చంపి.. ఆ తర్వాత కారులో తరలించటానికి ప్రయత్నిస్తూ ఇంటి ఓనర్ కు దొరికిపోయాడు.

 

Posted in Uncategorized

Latest Updates