ఎందుకో తెలుసా : గ్రీన్ జెర్సీతో కోహ్లీ సేన

viratkohlifanstossIPL సీజన్-11లో భాగంగా ఆదివారం (ఏప్రిల్-15) బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ తో ఢీకొంటోంది RCB. ఈ సందర్భంగా సోషల్ అవేర్ నెస్ కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా బరిలోకి దిగింది RCB. ఆరంభం నుంచి ఎరుపు, నలుపు కాంబినేషన్‌లో ఉన్న జెర్సీతో మ్యాచ్‌లు ఆడుతున్న కోహ్లీసేన ఆదివారం(ఏప్రిల్-15) గ్రీన్ జెర్సీతో మైదానంలోకి అడుగుపెట్టింది. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు, అభిమానులకు అవగాహన కల్పించడంలో భాగంగా RCB యాజమాన్యం గత కొన్నేళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తోంది. సొంతగడ్డపై జరిగే ఏదో ఒక మ్యాచ్‌ లో ఇలా కొన్నేళ్లుగా ఆడుతూ వస్తోంది. దీనిలో భాగంగా టాస్ వేసే సమయంలో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రహానెకు విరాట్ కోహ్లీ ఒక మొక్కను కూడా బహూకరించడం విశేషం. 2011 IPL సీజన్ నుంచి గ్రీన్ జెర్సీని ధరించి ‘గో గ్రీన్’ కార్యక్రమం పేరుతో గ్లోబల్ వార్మింగ్‌ పై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం RCB ఫ్రాంఛైజీ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates