ఎందుకో తెలుసా : 12న బీజేపీ ఎంపీల నిరాహార దీక్ష

modiపార్లమెంట్ లో ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. శుక్రవారం( ఏప్రిల్-6) బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. పార్లమెంట్లో ఏర్పడిన ఆటంకానికి నిరసనగా ఏప్రిల్ 12వ తేదీ తమ పార్టీ ఎంపీలు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సెషన్ మొత్తం వృధా కావడానికి కాంగ్రెస్సే కారణమంటూ విమర్శించారు. బీజేపీ కలుపుగోలు రాజకీయాలు చేసుంటే.. ప్రతిపక్షాలు మాత్రం విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

బడ్జెట్‌ సమావేశాల తీరుపై బీజేపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలు పూర్తయిన వెంటనే పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం  దగ్గర నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని రక్షించాలంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఇప్పటికే బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగని 23 రోజులకు ఎన్డీయే ఎంపీలు వేతనాన్ని తీసుకోబోమని కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates