ఎంపీగారి ట్విస్ట్ : శ్రీదేవి మృతిలో మాఫియా ఉండొచ్చు

SUశ్రీదేవి మరణంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవిది హత్య అని ఆరోపించారు ఆయన. శ్రీదేవి బస చేసిన హోటల్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. శ్రీదేవి డెత్ మిస్టరీ విషయంలో మీడియా క్రేజీగా మారిందని.. ఉన్నవి లేనివి ప్రసారం చేస్తోందని విమర్శించారు. శ్రీదేవికి ఆల్కహాల్ అలవాటు లేదని.. ఆమె శరీరంలోకి అది ఎలా వచ్చిందో తేల్చాలని డిమాండ్ చేశారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ, హీరోయిన్లతో దావూద్ పరిచయాలపైనా ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు సుబ్రహ్మణ్య స్వామి.

శ్రీదేవి మృతిలో దావూద్ పాత్ర అంటూ స్వామి కామెంట్స్ కలకలం రేపాయి. మూడు రోజులుగా అసలు ఏం జరిగిందో అర్థం కాక తికమక పడుతున్న ప్రజలకు.. ఇప్పుడు దావూద్ ప్రస్తావనను ఓ ఎంపీ తీసుకురావటం ఆందోళన కలిగిస్తోంది. నెటిజన్లు అయితే స్వామిని తిట్టిపోస్తున్నారు. శ్రీదేవికి కాదు.. ముందు స్వామికి నివాళులు అర్పించాలి అంటూ RIP అని కామెంట్ చేస్తున్నారు.


Posted in Uncategorized

Latest Updates