మధ్యప్రధేశ్ లో 80 మంది సిట్టింగులకు బీజేపీ షాక్

మధ్యప్రదేశ్ లో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ..మళ్లీ అధికారం కోసం సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించే అవకాశముంది. ఇందులో పలువురు మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 28న ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. అయితే..అభ్యర్ధులను మాత్రం ప్రకటించలేదు. ఇందుకోసం పూర్తిస్ధాయి కసరత్తును మొదలుపెట్టింది. ఎవరెవరికి టిక్కెట్లు ఇస్తే గెలుస్తారు? ఐదేళ్లలో ఎమ్మెల్యేల ఫర్ఫార్మెన్స్ ఎలా ఉంది? వంటి పలు అంశాలపై బీజేపీ అధిష్ఠానం అంతర్గతంగా సర్వేలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేపట్టిన “జన్ ఆశీర్వాద్ యాత్ర”లో  ప్రజల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చింది. సర్వేలు, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొన్న బీజేపీ హైకమాండ్ 70 నుంచి 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకూడదని  భావిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ 80 మంది స్ధానంలో కొత్తవారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మధ్యనే వెలువడిన ఒపీనియన్ పోల్స్ లో 15 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కుంచుకునే అవకాశముందని, అధికార బీజేపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్ కు కలిసి వస్తుందని తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయా ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వొద్దని బీజేపీ భావిస్తుంది. కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేవైఎం నాయకుడు ఒకరు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates