ఎంపీ పదవులకు బాల్క సుమన్, మల్లారెడ్డి రాజీనామా

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తమ పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేయనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి సీహెచ్ మల్లారెడ్డి శాసన సభ్యుడిగా గెలిచారు. ఈ ఇద్దరు నేతలను ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. కేసీఆర్ సూచనలతో…. బాల్కసుమన్, మల్లారెడ్డి రేపు డిసెంబర్ 14 శుక్రవారం రోజున ఢిల్లీ వెళ్లనున్నారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు రాజీనామా లేఖలు అందివ్వనున్నారు. ఆరు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో… ఖాళీ అయిన పెద్దపల్లి, మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగే సూచనలు లేవు.

Posted in Uncategorized

Latest Updates