ఎంపీ బాల్క సుమన్‌ పై అసత్య ప్రచారం : మంచిర్యాల సీఐ

Balka-suman0807టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్‌పై సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతో.. అసత్య ప్రచారం జరుగుతున్నదని రెండు రోజుల క్రితం మంచిర్యాల సీఐ మహేశ్ స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే బాల్కసుమన్ ఇంటిపై దాడి చేసిన విజేత, శంకర్‌ ను ఆదివారం (జూలై-8) బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు గోపాల్, సంధ్య పరారీలో ఉన్నారు. నిందితులు మంచిర్యాలకు చెందిన వారిగా గుర్తించారు.

బాల్క సుమన్ భార్య ఫోటోను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారు. సుమన్ భార్య స్థానంలో సంధ్య అనే మహిళ ఫోటోను జోడించి ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమాలలో ప్రచారంలో ఉన్నవి మార్ఫింగ్ చేసిన చిత్రాలు అని సీఐ స్పష్టం చేశారు. బాధితులుగా చెప్పుకుంటున్న బోయిని సంధ్య, విజేతలపై 2018, ఫిబ్రవరి 6న కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఎంపీని ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేసి లబ్ది పొందాలని ఎంపీ కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారని తెలిపారు సీఐ. సంధ్య, విజేతలు పలువురిని బ్లాక్‌మెయిల్ చేసి వేధించినట్లుగా విచారణలో తేలిందన్నారు. వీరిద్దరిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌ లోనూ కేసులు నమోదైనట్లు సీఐ మహేశ్ స్పష్టం చేశారు.

Posted in Uncategorized

Latest Updates