ఎంబీసీ జాబితాలో 36 కులాలు

బీసీ కులాల నుంచి అర్ధ సంచార తెగలు, విముక్త జాతులు, సంచార జాతులను ఎంబీసీలుగా (అత్యంత వెనకబడిన కులాలుగా) గుర్తిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 36 కులాలను ఎంబీసీ జాబితాలో చేర్చింది. వీటిలో 35 కులాలు కాగా, 36వ కులంగా అనాథలకు స్థానం కల్పించింది. వెనకబడిన కులాల్లో బీసీ, ఎంబీసీ, డీఎన్‌టీ (సంచార జాతులు, గంగిరెద్దులు, బుడబుక్కలు, పిచ్చకుంట్ల) తదితర విభాగాలున్నాయి. నిజానికి, తమిళనాడులో బీసీల విభజన స్పష్టంగా ఉంది. బీసీ కులాలను వృత్తి కులాలు, వ్యవసాయాధారిత కులాలు, వృత్తి లేని కులాలు, సంచార కులాలుగా విభజించాలని కేంద్రానికి నివేదిక ఇచ్చింది జాతీయ బీసీ కమిషన్‌.

రాష్ట్ర జనాభాలో 52 శాతానికిపైగా బీసీలున్నారు. వీరిలో ఎంబీసీల జనాభా 34 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీరిలో కులవృత్తులపై దాదాపు 25 లక్షల మంది దాకా ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంబీసీ జాబితా విడుదల చేసింది ప్రభుత్వం. దీనిలో చేర్చేందుకు సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబాటును ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలిపారు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.

 ఎంబీసీ కులాలు: బాలసంతుల, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దులవారు, జంగం, జోగి, కాటికాపల, మొండిబండ, వంశరాజు, పాముల, పార్ది, పంబాల, పెద్దమ్మలవాండ్లు, వీరముష్టి, గుడాల, కంజర, రెడ్డిక, మొండెపట్ట, నొక్కర్‌, పరికి ముగ్గుల, యాట, చొప్పెమారి, కైకాడి, జోషినందివాలాస్‌, మందుల, కునపులి, పట్ర, పాల-ఏకరి, రాజన్నల, బుక్క అయ్యవారు, గోత్రాల, కసికపాడి, సిద్దుల, సిక్లిగర్‌, అనాథలు.

Posted in Uncategorized

Latest Updates