ఎంసెట్ తో  బీఎస్సీ ఫారెస్ట్

eamcet-2018ఎంసెట్ ‘సెట్’ రూల్స్‌ను మార్చుతూ  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెంట్ ద్వారా భర్తీ అయ్యే ఇంజినీరింగ్, అగ్రి కల్చర్ బీఎస్సీ, మెడికల్, వెటర్నరీ కోర్సులతో పాటుగా ఇక నుంచి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును కూడా కలిపారు. ఇంటర్ లో బయాలజీ సబ్జెక్ట్ చదివిన విద్యార్థులు మాత్రమే బీఎస్సీ ఫారెస్ట్ కోర్సులో చేరేందుకు అర్హులని తెలిపింది. సవరించిన రూల్స్‌తో శుక్రవారం (ఫిబ్రవరి-23) విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చదవాలనుకునే విద్యార్థులు ఇక నుంచి ఎంసెట్ ద్వారానే అడ్మిషన్లు పొందాలి. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును విద్యార్థుల కనిష్ట వయసు డిసెంబర్ 31 వరకు 17 ఏళ్లు..గరిష్ట వయస్సు జనరల్, బీసీ అభ్యర్థులకు 22 ఏళ్లు ఉండాలి. SC,STలకు 25 ఏళ్లు ఉండాలి. ఈ నెల చివరి వారంలో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

Posted in Uncategorized

Latest Updates