ఎంసెట్ పేపర్ లీకేజీ కేసు : కీలక సూత్రదారి అరెస్ట్

2016 ఎంసెట్ 2 మెడికల్ ఎగ్జామ పేపర్ లీక్ వ్యవహారంలో సోమవారం (జూలై-9) మరో నిందితుడిని అరెస్ట్ చేశారు సీఐడీ అధికారులు. కర్ణాటక రాష్ట్రం దావణగెరెకి చెందిన మెడికల్ స్టూడెంట్ గణేష్ ప్రసాద్ స్కాంలో కీలకంగా వ్యవహరించాడని చెప్తున్నారు పోలీసులు. విజయవాడకు చెందిన గణేష్ ప్రసాద్ ముగ్గురు విద్యార్థులకు క్యాంపులో ఎగ్జామ్ రాయించడానికి 35 లక్షల చొప్పున డీల్ చేసుకున్నట్టు సమాచారం.

ఒక్కో విద్యార్థి నుంచి 3 లక్షలు కమిషన్ తీసుకున్నాడు గణేష్ ప్రసాద్. ఇప్పటికే అరెస్టైన ధనుంజయ్ తో ఇతడికి సంబంధాలున్నాయని గుర్తించారు సీఐడీ పోలీసులు. వీరిద్దరూ దావణగెరెలో మెడిస్ చదువుతున్నారు. ధనుంజయ్ సూచనలతోనే గణేష్ ప్రసాద్ విజయవాడ శ్రీచైతన్య కాలేజ్ కు చెందిన ముగ్గురు స్టూడెంట్స్ ను కటక్ తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించాడని తేల్చారు పోలీసులు. కొద్దిరోజుల క్రితం అరెస్టైన శ్రీ చైతన్య కాలేజ్ డీన్ వాసుబాబుతో గణేష్ లింక్ లపై ఆరా తీస్తున్నారు. స్కాంలో గణేష్ ప్రసాద్ A – 91 ఉన్నాడు. కేసులో ఇప్పటివరకు 70 మందిని అరెస్ట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates