తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

emcetతెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. డిఫ్యూటీ సీఎం కడియం శ్రీహరి శనివారం ( మే-19) సెక్రటేరియట్ లో ఫలితాలను విడుదల చేశారు. మొదటిసారిగా ఆన్ లైన్ లో జరిగిన్ ఎగ్జామ్స్ కి విద్యార్థుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఇంజినీరింగ్ లో 78.64 శాతం ఉత్తీర్ణత సాధించగా..ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ లో 90.72 శాతం అర్హత వచ్చిందన్నారు.

ఇంజినీరింగ్ లో  ఫస్ట్ ర్యాంక్  వెంకటపాణి వంశీనాథ్ కు రాగా….సెకండ్ ర్యాంక్ గట్టు మైత్రేయకు వచ్చింది.  అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో నమ్రతకు ఫస్ట్ ర్యాంక్ రాగా..సంజీవ్ కుమార్ రెడ్డికి సెకండ్ ర్యాంక్ వచ్చింది. మే 25 నుంచి మొదటి విడత కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పిన కడియం..జులై ఫస్ట్ వీక్ లో రెండో విడత కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. జూలై 16 నుంచి ఇంజనీరింగ్  క్లాసులు ప్రారంభం అవుతాయని చెప్పారు.

ఈ ఏడాది రాష్ట్రంలో అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో 73 వేల 106 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 66 వేల 858 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 60 వేల651(90.72 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1 లక్షా 47 వేల 958 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 1లక్షా 36 వేల 305 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 1 లక్షా 06 వేల 646(78.24 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ ర్యాంకు కార్డులను మే 22వ తేదీ నుంచి సంబంధిత వె బ్‌సైట్ నుంచి డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు. eamcet.tsche.ac.in వెబ్‌ సైట్ ద్వారా ర్యాంకు కార్డులు డౌన్‌ లోడ్ చేసుకోవాలి.  మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించిన విషయం విదితమే.

Posted in Uncategorized

Latest Updates