ఎంసెట్ లీకేజీ కేసు : మరో ఇద్దరి అరెస్ట్

ARRESTఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు వేలేటీ వాసుబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాసుబాబు శ్రీచైతన్య కళాశాల డీన్‌ గా పనిచేస్తున్నాడు. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల ఏజెంట్ కేవీ శివనారాయణ అరెస్ట్ చేశారు. నిందితులు మొత్తం ఆరుగురు విద్యార్థులకు ప్రశ్నపత్రం లీగ్ చేశారని పోలీసులు తెలిపారు.

ఒక్కో విద్యార్థి నుంచి రూ.35లక్షలు వసూలు చేశారని వెల్లడించారు. వేలేటీ వాసుబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనేశ్వర్ కేంద్రంగా జరిగిన పేపర్ లీకేజీలో వాసుబాబు కీలకపాత్ర పోషించారు. ఆరుగురు విద్యార్థులతో భువనేశ్వర్‌ లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు.  పేప‌ర్ లీకేజీ కేసులో ప్ర‌ధాన నిందితుడితో వాసుబాబు, శివ‌నారాయ‌ణ నిరంత‌రం ట‌చ్‌లోనే ఉన్నారు. 2016లో ప్ర‌ధాన నిందితుడిని వాసుబాబు క‌లిశాడ‌ని పోలీసులు గుర్తించారు. వాసుబాబుతో పాటు నారాయ‌ణ‌, శ్రీచైత‌న్య క‌ళాశాల‌ల ఏజెంట్ క‌మ్మ వెంక‌ట శివ‌నారాయ‌ణని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates