ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం: కేటీఆర్

ktrతెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ నారాయణగూడ ఐపీఎం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ని మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఇందులో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే పేషంట్లకు ఉచితంగానే టెస్టులు చేస్తారన్నారు. రోగులెవరూ ల్యాబ్ కు రానవసరం లేదన్నారు. PHCల నుంచి పేషెంట్ల శాంపిల్స్ తీసుకొచ్చిన 24గంటల్లోనే రిపోర్టులు పంపేలా ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే పదివేల జనాభాకు ఒకటి చొప్పున వెయ్యి బస్తీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో బ్లడ్ టెస్టు చేయించుకున్నారు మంత్రి కేటీఆర్.

తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ పేరుతో రూపొందించిన ఈ ల్యాబ్ లో 53 రకాల టెస్టులు చేస్తారు.  జిల్లాస్ధాయిలో కూడా డయాగ్నస్టిక్ ల్యాబ్ లు ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. హెల్త్ ప్రొఫైల్ బాగుండేందుకు ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభించడానికి మూడు నెలల ముందు నుంచే PHCల నుంచి వివిధ రకాల టెస్టుల కోసం శాంపిల్స్ కలెక్ట్ చేశారు. దాంతో  కోట్ల విలువైన పేదల డబ్బును ఆదా చేయగలిగామన్నారు అధికారులు. 24 గంటలు మూడు షిప్టులుగా ల్యాబ్ రన్ అవుతుండటంతో అవసరాన్నిబట్టి ఎక్కువ మంది సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు. డయాగ్నస్టిక్ హబ్ ప్రారంభోత్సవంలో వివిధ రకాల టెస్టులు చేయించుకున్న కొందరు పేషంట్లతో మాట్లాడించారు మంత్రి కేటీఆర్.

తెలంగాణ డయాగ్నస్టిక్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ లో మరికొన్ని వైరాలజీ టెస్టులు కూడా యాడ్ చేయాలనుకుంటోంది ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates