ఎక్కడికెళ్లినా అదే నెంబర్: ఆధార్ లాగే ఓటర్ గుర్తింపు కార్డు

దేశ వ్యాప్తంగా ఉన్న దొంగ ఓటర్ కార్డులను నియంత్రించేందుకు…ఓటర్ కార్డుకు విశిష్ట గుర్తింపు సంఖ్యను తీసుకు రానుంది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలో ఎక్కడికి మారినా అదే నెంబర్ వర్తించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. జనవరిలో దీనిని అందుబాటులోకి తీసుకురానున్న ఎన్నికల కమిషన్…అన్ లైన్లో అన్ని రాష్ట్రాల ఓటర్ లిస్టులను ఉంచనుంది. దీంతో నియోజక వర్గం పరిధిలోనే కాకుండా రాష్ట్రాల పరిధిలో బోగస్ ఓటర్లకు అడ్డుకట్ట వేయవచ్చు.

ప్రస్తుతం ఓటరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారితే అడ్రస్ తోపాటే ఓటరు కార్డు, దానిపై ఉండే నెంబరు కూడా మారిపోతుంది.  దీంతో అంతకుముందున్న ఓటు హక్కును రద్దు చేయకుండానే మరో రెండు, మూడు  ప్రాంతాల్లో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని అరికట్టేందుకు ఆధార్‌ వ్యవస్థలాగే ఓటరుకూ విశిష్ట సంఖ్య ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ఓటరు జీవించి ఉన్నంతకాలం అదే నెంబరు ఉంటుంది. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ఓటర్లకు పది లేదా పన్నెండు అంకెల విశిష్ట నెంబర్‌ జారీ చేయనున్నారు. ఈ విశిష్ట నెంబరు ప్రక్రియను జనవరి ఒకటో తేదీన దేశవ్యాప్తంగా అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సలహాదారు భన్వర్‌లాల్‌ తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates