ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు : భట్టి విక్రమార్క

తిరుమల : ఎవరైనా, ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చన్నారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. ఫలితాన్ని మాత్రం ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కేసీఆర్ ఆంధ్రాలో ప్రచారం చేస్తారనే వార్తలపై ఆయన ఇలా స్పందించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates