ఎక్కడైనా సరే : రోడ్డుపై గల్లీ క్రికెట్ ఆడిన సచిన్

GALLIక్రికెట్ అనగానే ఎవరికైనా ఫస్ట్ గుర్తుకు వచ్చే పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. క్రికెట్ అభిమానులు సచిన్ ను దేవుడిగా కొలుస్తారు. ఒక్క భారత్ లో మాత్రమే కాదు… ప్రపంచవ్యాప్తంగా సచిన్ కు కోట్లాదిమంది అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో సుధీర్ఘకాలం కొనసాగి క్రికెట్‌ కు తన సేవలందించాడు సచిన్. సచిన్ రికార్డులను బద్దలు కొట్టడం ఎవ్వరకీ సాధ్యం కాదని క్రికెట్ విశ్లేషకులు చెబుతారు. అయితే వన్డేలు, టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించినా కూడా IPLలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీకి మార్గనిర్దేశనం చేస్తూ ఇంకా క్రికెట్ తో అనుబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇప్పుడు కొంత మంది యువకులకు క్రికెట్ టెక్నిక్స్ చెప్తూ వారితో కలసి గల్లీలో క్రికెట్ ఆడాడు సచిన్. రోడ్డుపై రాత్రివేళ పక్క నుంచి వాహనాలు వెళ్తున్నా కూడా ప్లాస్టిక్ డివైడర్‌ను స్టంప్‌లుగా చేసుకొని సచిన్ బ్యాటింగ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గల్లీలో అయినా, గ్రౌండ్ లో అయినా ఎప్పటికీ సచిన్ నెంబర్.1 అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates