ఎక్కువగా వాడితే అంతే : సెల్ ఫోన్లతో చర్మ వ్మాదులు

 సెల్‌ ఫోన్‌ అధికంగా వాడటం వల్ల కళ్లు దెబ్బతింటాయి.. మానసిక రుగ్మతలకు దారితీస్తుంది.. ఇవి అందరికీ తెలిసిన విషయాలే! అయితే ఇప్పుడు కొత్త విషయం వెలుగు చూసింది. సెల్‌ ఫోన్‌ లను ఎక్కువసేపు వాడటం వల్ల దానినుంచి విడుదలయ్యే బ్లూ లైట్‌ కారణంగా చర్మం దెబ్బతింటుందని చర్మవైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా త్వరగా వయసు మీదపడిన ఛాయలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ముంబైకి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్టు డా. షెఫాలి ట్రాసీ నెరూర్‌‌‌‌కర్‌‌‌‌.

గంటల తరబడి సెల్‌ ఫోన్‌ లు వాడుతూ ఉంటే పిగ్మెంటేషన్‌ , ఇన్‌ ఫ్లమేషన్‌ , చర్మం బలహీనపడటం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. సెల్‌ ఫోన్లు మాత్రమే కాకుండా కంప్యూటర్‌‌‌‌ తెరలనుంచి విడుదలయ్యే బ్లూ లైట్‌ కూడా మన చర్మానికి రక్షణగా నిలిచే కొల్లెజన్‌ అనే ప్రోటీన్‌ ఉత్పత్తి తగ్గిస్తుందని తెలిపారు. అంతే కాకుండా రాత్రుళ్లు ఎక్కువగా సెల్‌ ఫోన్లు ఉపయోగించే వారి నిద్రకు అటంకాలు ఏర్పడటం మూలాన మానసిక, శారీరక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని వెల్లడించారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన విశ్రాంతి అవసరమని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates