ఎక్కువ ATMలలో డబ్బు ఉంది : శివ ప్రతాప్ శుక్లా

shiv-pratap-shuklaదేశంలోని 80 శాతం కంటే ఎక్కువ‌ ఏటీఎంలలో క్యాష్ ఉందన్నారు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా.  నగదు కొరత అంశంపై ఆయన స్పందించారు. కావాలనే కొందరు తమ ఇమేజ్‌ను పెంచుకునేందుకు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బ్యాంకుల గురించి కానీ ఏటీఎంల గురించి కానీ తప్పుడు ప్రచారం చేయరాదు అని ప్రజలను కోరారు కేంద్ర మంత్రి. ఇదిలా ఉండగా బీహార్‌లోని పట్నా ప్రజలు మాత్రం తమకు కావాల్సిన డబ్బు అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఏటీఎంలలో క్యాష్ ఉండడం లేదని, నగదు కోసం ఏటీఎంల చట్టు తిరగాల్సి వస్తుందంటున్నారు. ముంబై ప్రజలు మాత్రం తమకు ఇబ్బందులు లేవన్నారు. అన్ని ఏటీఎం మెషీన్లు పని చేస్తున్నాయని, డబ్బుకు కొరత లేదని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates