ఎగబడి కొన్న పేరంట్స్ : ఒక్కో క్వశ్చన్ పేపర్ రూ.35వేలు

cbseCBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ఎగ్జామ్ పేపర్ల లీక్ అవ్వటం, మళ్లీ పరీక్ష నిర్వహించటంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. 16లక్షల మంది పిల్లలు ఇప్పుడు మళ్లీ మ్యాథ్స్ (గణితం) కోసం ప్రిపేర్ అవుతున్నారు. సెలవులకు వెళ్లిన పిల్లలు ఇప్పుడు మళ్లీ ఇంటి బాట పట్టారు. ఎంతో పకడ్భందీగా జరుగుతాయి అని చెప్పుకునే CBSEలో కూడా ఇలాంటి అవకతవకలు జరగటం ఇదే ఫస్ట్ అంటున్నారు పేరంట్స్. మళ్లీ పరీక్ష నిర్వహించటం అంటే.. బోర్డ్ లో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో అర్థం అవుతుందన్నారు. ఈ విషయంలో సీరియస్ గా ఉన్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి.

CBSE బోర్డులోని కొందరు ఉద్యోగులు పరీక్ష క్వశ్చన్ పేపర్లను లీక్ చేశారు. వీటిని అమ్మకానికి పెట్టారు. ఒక్కో పేపర్ రూ.35వేల చొప్పున అమ్మేశారు. అంతా సవ్యంగా సాగిన ఈ వ్యవహారం లీక్ కావటానికి మరో ముఖ్య కారణం ఉంది. ఒక్కో పేపర్ ను రూ.35వేలకి కొనుగోలు చేసిన పేరంట్స్ వాటిని జిరాక్స్ తీసి.. రూ.5వేల చొప్పున మిగతా పేరంట్స్ కి అమ్మేశారు. ఇలా క్వశ్చన్ పేపర్ వెయ్యి మందికి చేరిపోయింది. ఒకరూ, ఇద్దరూ అయితే పర్వాలేదు.. వెయ్యి మంది చేతుల్లోకి క్వశ్చన్ పేపర్ వెళ్లిపోవటంతో రచ్చ అయ్యింది. చివరికి వాట్సాప్ గ్రూప్స్ లో చెక్కర్లు కొట్టింది.

CBSE క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో.. ఎగ్జామ్ ఇంచార్జితోపాటు ఇద్దరు పోలీసులను కూడా విచారిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నా ఎలా లీక్ చేశారనేది ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ లోని ఐదుగురు ట్యూటర్లతోపాటు 18 మంది విద్యార్థులను కూడా ఇప్పటికే విచారించారు అధికారులు. ఇప్పటి వరకు జరిగిన విచారణ చూస్తూ.. ఎగ్జామ్ కి రెండు రోజుల ముందే పేపర్ లీక్ అయినట్లు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates