ఎగ్జామ్స్ లో టాప్ ర్యాంక్ రాలేదని…. విద్యార్ధిని ఆత్మహత్య

ANJAఎగ్జామ్స్ లో మంచి మార్కులు రాలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకొంది.  తండ్రి రివాల్వర్ తో బాత్ రూమ్ లో కాల్చుకొని చనిపోయింది. హరియాణా రాష్ట్రంలోని జింద్ జిల్లాలో ఆదివారం(ఏప్రిల్1) ఈ ఘటన జరిగింది.

జింద్ జిల్లాలోని సివాహ్ గ్రామ సర్పంచ్‌ వేద్‌ పాల్‌  కుతూరు అంజలి కుమారి ఇండస్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో 11వ తరగతి చదువుతోంది. శనివారం(మార్చి31) అంజలి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే తాను అనుకున్న మార్కులు రాలేదని అంజలి భాధ పడింది. టాపర్ అవుతునానుకుంటే ఇలా వచ్చాయి ఏంటి మార్కులు అని భాధపడుతున్న సమయంలో ఆదివారం(ఏప్రిల్1) అంజలి కుటుంబం దగ్గర్లోని వేరే గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో అంజలి దగ్గరే ఉంది.  వెంటనే ఇంటికి రమ్మని తన తండ్రి కి ఫోన్‌ చేసింది. అయితే వారు  వచ్చేసరికి బాత్ రూమ్ లో తండ్రి రివాల్వర్ తో కాల్చుకొని పడి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు DSP సునీల్ కుమార్  తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates