ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రెగ్నెంట్‌‌‌‌‌‌‌‌ భార్యతో… 

స్కూటర్‌‌పై 1,200 కిలోమీటర్లు
మూడు రోజులు జర్నీ చేసి జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ నుంచి మధ్యప్రదేశ్‌ చేరుకున్న కపుల్

గ్వాలియర్‌‌‌‌‌‌‌‌: ఆ కపుల్‌‌‌‌‌‌‌‌ జార్ఖండ్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నారు. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో భార్య డీఈడీ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ రాయాల్సింది. ఆమె ప్రెగ్నెంట్‌‌‌‌‌‌‌‌. వానలు బాగా పడుతున్నయ్‌‌‌‌‌‌‌‌. పైగా గుంతల రోడ్లు. అయినా భార్య కోసం బండెక్కాడు. సుమారు 1,200 కిలోమీటర్లు స్కూటర్‌‌‌‌‌‌‌‌ నడిపాడు. జార్ఖండ్‌‌‌‌‌‌‌‌లోని గొడ్డ జిల్లా గంటటొల విలేజ్‌‌‌‌‌‌‌‌ నుంచి మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని గ్వాలియర్‌‌‌‌‌‌‌‌లో పరీక్ష సెంటర్‌‌‌‌‌‌‌‌కు భార్యను క్షేమంగా తీసుకెళ్లాడు. ఆయన పేరు ధనంజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ (27). భార్య సోని హెంబ్రమ్‌‌‌‌‌‌‌‌ (22). ఏడాది కిందటే ఇద్దరికీ పెళ్లి అయింది. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ ముందు వరకు ధనంజయ్‌‌‌‌‌‌‌‌ కుక్‌‌‌‌‌‌‌‌గా పని చేశాడు. తర్వాత జాబ్‌‌‌‌‌‌‌‌ పోయింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే భార్య రాయాల్సిన డీఈడీ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌ డేట్స్‌‌‌‌‌‌‌‌ వచ్చేశాయి. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని గ్వాలియర్‌‌‌‌‌‌‌‌లో పరీక్ష రాయాలి. బస్సులు, ట్రైన్లు, ఇతర ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ఏదీ లేదు. జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ నుంచి గ్వాలియర్‌‌‌‌‌‌‌‌ వరకు ట్యాక్సీ అడిగాడు. రూ. 30 వేలు అన్నారు. దగ్గరున్న కాస్త బంగారం తాకట్టు పెడితే రూ. 10 వేలే వచ్చాయి. ఇక ఇట్లా కుదరదని అర్థమైంది. భార్య సోని ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ రాయొద్దని ఫిక్స్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. కానీ ధనంజయ్‌‌‌‌‌‌‌‌ స్కూటర్‌‌‌‌‌‌‌‌పై తీసుకెళ్తానన్నాడు. భార్యను ఒప్పించాడు.

రూ. 5 వేలు ఖర్చయింది

జార్ఖండ్‌‌‌‌‌‌‌‌లోని గొడ్డ ప్రాంతం నుంచి ఆగస్టు 28న పొద్దున బయలుదేరారు. ఒకరోజు రాత్రి బీహార్‌‌‌‌‌‌‌‌లోని ముజఫర్‌‌‌‌‌‌‌‌ పూర్‌‌‌‌‌‌‌‌లో, తర్వాత లక్నోలో ఉన్నారు. ఆగస్టు 30 రోజున ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతానికి ఇద్దరూ చేరుకున్నారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 11 వరకు డీఈడీ పరీక్షలు జరగనున్నాయి. గ్వాలియర్‌‌‌‌‌‌‌‌ వరకు రావడానికి తమకు రూ. 5 వేలు ఖర్చయిందని, ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌ 10 రోజుల వరకు ఉన్నాయి కాబట్టి గ్వాలియర్‌‌‌‌‌‌‌‌లో రూమ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నామని ధనంజయ్‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. విషయం తెలుసుకున్న గ్వాలియర్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వాళ్లకు రూ. 5 వేలు తక్షణ సాయం కింద అందించాలన్నారు. ‘వర్షం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. మధ్యలో నాకు జ్వరం కూడా వచ్చింది. కానీ తర్వాత తగ్గిపోయింది. టీచర్‌‌‌‌‌‌‌‌ జాబ్‌‌‌‌‌‌‌‌కు తప్పకుండా సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ అవుతానని నాకు నమ్మకం ఉంది’ అని
సోని చెప్పారు.

Latest Updates