ఎగ్జామ్ రాయనీయలేదని.. UPSC స్టూడెంట్ ఆత్మహత్య

IF ఢిల్లీలో UPSC స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ రాజేంద్రనగర్ లోని అద్దె ఇంట్లో ఆదివారం(జూన్-3) యువకుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఆదివారం(జూన్-3) దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ కోసం ప్రిలిమినరి ఎగ్జామ్ నిర్వహించింది UPSC. ఎగ్జామ్ రాసేందుకు పహార్ గంజ్ సెంటర్ వచ్చిన వరుణ్ (28) అనే యువకుడిని లేటుగా వచ్చాడన్న కారణంతో ఎగ్జామ్ రాసేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వరుణ్.. ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

వరుణ్ ను కర్ణాటకకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వరుణ్ మృతదేహం దగ్గర ఓ సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. అమ్మానాన్న నన్ను క్షమించండి, దయచేసి నన్ను మర్చిపోండి అంటూ ఆ నోట్ లో రాసి ఉందని పోలీసులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates