ఎజెండాను ప్రజల్లోకి తీస్కెళ్లలేక పోయాం: కోదండరామ్

ఉద్యమ ఆకాంక్షలు సాధించేందుకు మేనిఫేస్టో రూపొందించామన్నారు TJS అధ్యక్షుడు కోదండరామ్. మా కార్యచరణ ఎన్నికల కోసం కాదని… అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో తమ ఎజెండాలోని అంశాలున్నాయన్నారు. అయితే ఎజెండాను ప్రజల్లోకి తీస్కెళ్లలేక పోయామన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన TRS కు అభినందనలు తెలిపారు. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో తన బాధ్యతను TRS నిర్వర్తించాలన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

రాజకీయాల్లో భాగస్వామ్యం ఎన్నికలతో మొదలై, ఎన్నికలతో ముగిసేది కాదని ఆయన చెప్పారు. ఈ భాగస్వామ్యం నిరంతరం కొనసాగించాల్సి ఉందన్నారు. భారత రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలి కోరుకుంటున్నామన్నారు. ఓటర్ల నమోదులో అవకతవకలు జరిగాయన్నారు. చాలా నియోజిక వర్గాల్లో ఓటర్లు నమోదు కాలేదన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ అంగీకరించి క్షమాపణలు కోరిందన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే దాడులకు లోనయ్యారని…ఈ ఘటనలు ఎన్నికల కమిషన్ కు మచ్చలా మిగిలి పోతాయన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  కోరారు. ఇప్పటి వరకు సామాన్యులకు న్యాయం జరగాలని కృషిచేస్తూ వచ్చాం… వారు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితులు రావాలన్నారు. నాలుగేళ్ళుగా అదే ప్రయత్నం చేసామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యచరణతో కష్టపడ్డామో అదే తీరులో భవిష్యత్తులోనూ పోరాడుతామన్నారు. దీనికోసం అందరం కలిసి నడవాలన్నారు కోదండరామ్.

Posted in Uncategorized

Latest Updates