ఎటు చూసినా వాళ్లే : ముంబై మ్యాచ్ కు హాజరైన 21 వేల మంది చిన్నారులు

HDSవాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్- ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌కు మద్దతుగా ముంబై నగరానికి చెందిన 21వేల మంది చిన్నారులు మ్యాచ్‌ కు హాజరయ్యారు. మొత్తం 33 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న వాంఖడే స్టేడియంలో ఎటు చూసినా చిన్నారులే కనిపిస్తున్నారు. ముంబయి ఇండియన్స్‌-రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 21వేల మంది చిన్నారులు ఉచితంగా ఈ మ్యాచ్‌ను చూస్తున్నారు. చిన్నారుల మద్దతుతో ముంబయి ఇండియన్స్‌ సొంతగడ్డపై తొలి విజయాన్ని నమోదు చేయాలని ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు ఆశిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ తోనే IPL లో బోణి కొట్టాలని ఢిల్లీ ఆటగాళ్లు భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates