ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రమాదం..వ్యక్తి మృతి

PALAMURUపాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం పనుల్లో ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో సొరంగం పనులు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారికి కొల్లాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. వీరంతా పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates