ఎత్తి పడేసి..పారిపోయిన స్కూటర్

BIKEబైక్ పై వెళ్తున్న ఓ ఫ్యామిలీకి కారు అడ్డం రావడంతో…సడన్ బ్రేక్ వేశాడు ఆ యజమాని. దీంతో బైక్ ఉన్న ముగ్గురిని ఎత్తిపడేసింది స్కూటర్. అంతే కాదు.. తర్వాత ఆ వాహనదారుడికే దొరక్కుండా పరుగులు తీసింది. ఈ ఘటనలో ప్రయాణిస్తున్న వాళ్లు ప్రమాదం నుంచి బయటపడినా…స్కూటర్ మాత్ర పరుగులు తీయడం ఘటనా స్థలంలో ఉన్న వారిని ఆశ్చర్య పరిచింది. ఈ వింతైన ఘటన చైనాలో జరిగింది. భార్య,కూతురుతో పాటు ఓ వ్యక్తి స్కూటర్ పై వెళ్తుండగా సడన్ గా ఓకారు ఎదురు వచ్చింది. దీంతో ఆ స్కూటరిస్టు ఒక్క సారిగా ఫ్రంట్ బ్రేక్ వేయడంతో ముగ్గురు అమాంతంగా ముందుకు పడ్డారు. స్కూటర్ కూడా వారి పై నుంచి ఫల్టీ కొట్టి ఓ పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో వారికి స్వల్పగాయాలయ్యాయి.

రోడ్డుపై పడిన ఆ స్కూటర్‌ను తీసుకోడానికి వెళ్లిన ఆ యాజమానికి వింత అనుభవం ఎదురైంది. స్కూటర్‌ను పైకి లేపగానే దానంతట అదే పరుగు పెట్టింది. దానితో పాటు యజమాని కూడా పరుగు తీశాడు. ఇక దాన్ని ఆపలేక వదిలేయడంతో అది కొంత దూరం వెళ్లి ఓ కారుకు ఢీ కొట్టి కిందపడిపోయింది. ఆ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Traffic Accident

Falling from the motorcycle is just the beginning…

China Daily 发布于 2018年1月31日周三

Posted in Uncategorized

Latest Updates