ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి

ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. దంతేవాడ-సుక్మా రిజర్వ్ బోర్డర్ లో భద్రతా బలగాలు… నక్సల్స్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో నక్సల్స్‌కు భద్రతా సిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ మృతిచెందినట్లు సుక్మా జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. సంఘటనా స్థలం నుంచి ఒక గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates