ఎనర్జీ కోసం : డ్రైఫ్రూట్స్ కి పెరిగిన డిమాండ్

ramరంజాన్ మాసం  కావడంతో.. డ్రై  ఫ్రూట్స్ కు  డిమాండ్ ఎక్కువగా  ఉంది. ఉపవాసం చేస్తాం  కాబట్టి  ఎనర్జీ  కోసం.. డ్రైఫ్రూట్స్  ఎక్కువగా  తీసుకుంటారు  ముస్లింలు. దాంతో హోల్ సేల్ మార్కెట్ కు పెట్టింది పేరైన బేగంబజార్ లో డ్రైఫ్రూట్ షాప్ లు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి.

రంజాన్ మాసంలో 14 గంటలు ఉపవాసం చేస్తారు ముస్లింలు. దీంతో ఎనర్జీ కోసం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటారు. మహ్మద్ ప్రవక్త.. ఖర్జురాలు ఎక్కువగా తినేవారని.. సెంటిమెంట్ గా డేట్స్ తింటారు ముస్లింలు. ఖర్జూరలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఇరాకి జహిలి, ఇరాని కుబ్ కుబ్, ఇరాని చౌమి, ముజాఫది, తైబా.. ఇలా 20 రకాల ఖర్జురాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా ఇరాన్, దుబాయ్, గల్ఫ్, ఇరాక్, తునేషియా దేశాల నుంచి డేట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి. ధరల విషయానికొస్తే క్వాలిటీని బట్టి కేజీ 60 నుంచి 300 వరకు రేటు ఉంది.

ఖర్జూరతో పాటు.. బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్ లాంటి డ్రైప్రూట్స్ కూడా ఎక్కువగా సేల్ అవుతాయి. హోల్ సేల్ రేట్లలో కొనాలంటే.. సిటీలో బేగంబజార్ కే వెళ్తున్నారు ముస్లింలు. మార్కెట్లో జీడిపప్పు ఎక్కువ రేటుంది. కేజీ 9వందల నుంచి  12 వందల వరకు పలుకుతుంది. ఇక బాదం 700 నుంచి వెయ్యి వరకు ధరలున్నాయి. కిలో కిస్మిస్ 250 నుంచి 400 వరకు ఉంది.  రేట్లు ఎక్కువగా ఉండటంతో కొనడం కష్టంగా ఉందంటున్నారు ముస్లింలు.

 

Posted in Uncategorized

Latest Updates