ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రామ్ : భార్య తీసిన ఫస్ట్ ఫొటో ఇది

JR NTRయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పుత్రోత్సాహం రెట్టింపు అయ్యింది. ఫ్యామిలీతో జాలీగా గడపుతున్నాడు. ఎన్టీఆర్‌ జూన్ 14న రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. రెండో సారి తండ్రి అయిన విషయాన్ని తెలుపుతూ.. నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే ఎన్టీఆర్‌ ఇటీవలే ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్ తెరిచారు. ఇన్‌ స్టాలో మొదటిసారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను షేర్‌ చేశాడు.

అభయ్‌ తన చిన్ని తమ్ముడిని పట్టుకుని కూర్చీలో కూర్చుంటే.. వారి ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు ఎన్టీఆర్. ఈ ఫొటోను ప్రణతి తీశారని.. తను ఏ ఉద్ధేశంతో తీసిందో తెలియదని ట్విట్ చేశాడు ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫస్ట్ ఫోటో సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్ లో హీరో రామ్ చరణ్ తో కలిసి RRR సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates