ఎన్టీఆర్ బయోపిక్ : కృష్ణగా మహేష్…బాబుగా రానా

mahesh-ranaఎన్టీఆర్ గొప్పతనం గురించి తెర‌కెక్క‌నున్న సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాల‌య్య నటించనున్నారు. క్రిష్ తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రంలో బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ క‌నిపించ‌నుంది. ఇక ఎన్టీఆర్ జీవితంలో కీలకంగా ఉన్న ఏఎన్ఆర్ పాత్ర కోసం నాగ చైత‌న్య‌ని ఎంపిక చేశార‌ని తెలిసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం కృష్ణ పాత్రని మ‌హేష్ బాబు , చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ని రానా చేయ‌నున్న‌ట్టు ప్రచారం జరుగుతుంది. మోహ‌న్ బాబు, రాజ‌శేఖ‌ర్ కూడా ఈ బ‌యోపిక్‌లో ముఖ్య పాత్ర‌లు చేయ‌నున్నార‌ట‌. చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్ ఫిలిం సిటీలోను, రామ కృష్ణ సినీ స్టూడియోలో చిత్రీక‌రించున్నారు. ఎన్టీఆర్ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో సినిమాని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న బాల‌య్య పాత్ర‌ల ఎంపిక‌లో మంచి పేరున్న న‌టీన‌టుల‌నే తీసుకోమ‌ని చెప్పాడంతో ఈ క్ర‌మంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు అడుగులు వేస్తున్నారని చిత్ర పరిశ్రమలోని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates