ఎన్టీఆర్ బయోపిక్ : బాలయ్యకు లీగల్ నోటీసులు

v6-fb-(3)బాలయ్యకు లీగల్ నోటీసులు ఇచ్చారు. అది కూడా ఓ సినిమాపై. స్వయంగా నటిస్తూ.. నిర్మిస్తున్న తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ మూవీపై. ఈ సినిమాకు  క్రిష్ దర్శకుడు. ఈ సినిమాలో తమ పాత్రలను నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు పెద్ద కుమారుడు.. బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌కు గురువారం లీగల్ నోటీసులు పంపారు.

ఎన్టీఆర్ బయోపిక్‌‌ మూవీ ఇటీవలే గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభం అయ్యింది. మొదట మూవీకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తేజ తప్పుకున్నాడు. ఇటీవలే క్రిష్ జాయిన్ అయ్యాడు. ఎన్నికలకు ముందే..  ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ టైంలోనే.. సినిమాలో తమ పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదంటూ నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో నాదెండ్ల భాస్కర్ రావుకు సంబంధించిన పాత్రల విషయమై నెగిటివ్‌గా చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మా పాత్రల గురించి ముందుగా చెప్పాలని.. అభ్యంతరకరంగా చిత్రీకరించొద్దని కోరారు. ముందుగా కథ చెప్పాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates