ఎన్టీఆర్ బయోపిక్….హరికృష్ణగా కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మరో లుక్ రిలీజ్ అయింది. ఇప్పటికే మూవీలోని ఒక్కో లుక్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోన్న మూవీ టీం దసరా సందర్భంగా హరికృష్ణ లుక్ రిలీజ్ చేసింది. హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు, హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కుర్చీలో కూర్చొని ఏదో చెబుతుంటే.. హరికృష్ణ  పాత్రలో కళ్యాణ్ రామ్ వినయంగా ఆ మాటలను వింటున్నట్లు ఈ పోస్టర్ లో ఉంది. పోస్టర్‌ ను కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ‘అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. ఎన్టీఆర్ బయోపిక్‌ లో మా నాన్న పాత్రలో నటిస్తుండటం చాలా గర్వంగానూ, భావోద్వేగంగాను ఉంది అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. 2019 సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షుకుల ముందుకు రానుంది.

Posted in Uncategorized

Latest Updates