ఎన్టీఆర్ సినిమా ప్రారంభం

NTR-Biopicబాలకృష్ణ హీరోగా విశ‍్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ సినిమా ఇవాళ (గురువారం) రామకృష్ణ హర్టీ కల్చరల్‌ సినీ స్టూడియోలో ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బిజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దర్శకులు రాఘవేంద్ర రావు, బోయపాటి శ్రీను, వివి వినాయక్‌, పూరి జగన్నాథ్‌ లతో పాటు పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు. నందమూరి యువ కథానాయకుడు కళ్యాణ్ రామ్‌ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్‌ అద్భుతం‍గా నటించి మెప్పించిన దానవీర శూర కర్ణ సినిమాలోని ‘రాచరికమా అర్హతలు నిర్ణయించునది’ అనే డైలాగ్‌లను తొలి షాట్‌గా చిత్రీకరించారు. వెంకయ్య నాయుడు క్లాప్‌ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు.కీరవాణి సంగీతమందిస్తుండగా బాలీవుడ్ ఛాయగ్రాహకుడు సంతోష్‌ తుండియిల్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసి 2019 సంక్రాంతికి సినిమాను విడుదల చేయీలనుకుంటున్నారు నిర్వాహకులు.

 

Posted in Uncategorized

Latest Updates