ఎన్నాకెన్నాళ్లకు : కాచిగూడ – కరీంనగర్ ప్యాసింజర్ రైలు ప్రారంభం

RAILఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కరీంనగర్ వాసుల కల నెరవేరింది. కాచిగూడ-కరీంనగర్ మధ్య ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాచిగూడ-కరీంనగర్ ప్యాసింజర్ రైలును కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌గోయల్ జెండా ఊపి రిమోట్ ద్వారా ప్రారంభించారు. తర్వాత రైల్వే స్టేషన్‌కు ప్లాటినం గ్రీన్ రేటింగ్ అవార్డును ప్రదానం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి పనులను పీయూష్ గోయల్ ప్రారంభించారు.

అన్ని రైల్వే స్టేషన్లు, పరిపాలన భవనాల్లో ఏర్పాటు చేసిన LED లైట్లను, కాచిగూడ స్టేషన్‌లో 400కిలో వాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ను ప్రారంభించారు. నాలుగో పాదచారుల వంతెన నిర్మాణానికి గోయల్ శంకుస్థాపన చేశారు. 20 గ్రామీణ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన వైఫై సదుపాయాన్ని గోయల్ జాతికి అంకితం చేశారు. గొల్లపల్లి స్టేషన్‌లోని వైఫై సదుపాయాన్ని స్థానిక పాఠశాల ఉపయోగించుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు దత్తాత్రేయ, కవిత, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, రైల్వే జీఎం తదితరులు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates