ఎన్నాళ్లు ఇలా దోచుకుంటారు : రూ.3వేల కోట్ల కుంభకోణంలో బ్యాంక్ అధికారుల అరెస్ట్

banklమరో షాకింగ్ న్యూస్ ఇది. మరో బ్యాంక్ లో వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణంలో ఆ బ్యాంక్ ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో DSK గ్రూప్ కింద మంజూరు చేసిన 3వేల కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి జూన్ 20వ తేదీ బుధవారం కీలక పరిణామం జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆర్.కె.గుప్తా, ఎండీ రవీంద్రను అరెస్ట్ చేశారు పూణె పోలీసులు. అదే విధంగా ఈ బ్యాంక్ మాజీ సీఎండీ అయిన సుశీల్ ను జైపూర్ లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఫిబ్రవరిలోనే మహారాష్ట్రలో ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ కంపెనీ అయిన DSK.. 3వేల కోట్ల రూపాయల బ్యాంక్ ఎగ్గొట్టిన కేసు వెలుగులోకి వచ్చింది.

బ్యాంక్ నుంచి అప్పులు మంజూరు విషయంలో ఎండీ, సీఈవోలు నిబంధనలను తుంగలో తొక్కారని నిర్థారించారు. దీంతో వీరిపై చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్, కుట్ర కింద 120(B), 406, 409, 420, 465, 467, 468, 471, 109 r/w 34 IPC & 13(1)(c) r/w 13(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3వేల కోట్లలో.. అక్షరాల రూ.2వేల 892 కోట్లను సంస్థలోకి కాకుండా ఇతర ఖాతాలకు మళ్లించారు. అప్పు మంజూరు విషయంలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారని.. రూల్స్ పట్టించుకోకుండా నిధులు విడుదల చేశారని లావాదేవీల ఆధారంగా గుర్తించారు విచారణ అధికారులు. ఇప్పటి వరకు రూ.3వేల కోట్లను తిరిగి చెల్లించని DSK సంస్థ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించారని.. కుట్రలో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తేలటంతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు పూణె పోలీసులు. వీరికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు, కొన్ని ఆస్తులను కూడా సీజ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates