ఎన్నికలకు అంతా సిద్ధం.. సాయంత్రం 5 దాటితే ఓటు వేయనీయం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మీడియాతో మట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరుగనున్న ఎన్నికలకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. పొద్దున 7 గంటలకు ఓటింగ్ మొదలవుతుందని తెలిపారు. ఓటర్లందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

సాయత్రం 5గంటల లోపు వచ్చి లైన్లో ఉన్న వారికే ఓటు వేసేవీలుంటుందని… 5 దాటిన తరువాత వచ్చిన వారు ఓటు హక్కును వినియోగించుకునే వీలు లేదని తెలిపారు. దీంతో పాటే.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని చెప్పారు. 13 నియోజకవర్గాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని తెలిపారు. ఈ నియోజకవర్గాల్లో 4గంటల లోపు వచ్చి లైన్లో నిల్చున్న వారికి మాత్రమే ఓటుహక్కు ఉపయోగించుకునే వీలుంటుందని రజత్ కుమార్ తెలిపారు.

తెలంగాణలో సీ-విజిల్ యాప్‌కు స్పందన బాగుందని రజత్ కుమార్ అన్నారు. సీవిజిల్ యాప్ ద్వారా మొత్తం 8 వేల ఫిర్యాదులు అందాయని తెలిపారు. వాటిలో ఇప్పటి వరకు 90 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు చెప్పారు. ఓటింగ్ రోజు కూడా సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates