ఎన్నికలకు పూర్తి భద్రత : డీజీపీ

హైదరాబాద్‌: ఎన్నికల కోసం అన్ని రకాల భద్రతా ఏర్పా ట్లను పూర్తి చేసినట్టు రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశామన్నారు. బుధవారం దీనిపై డీజీపీ ఆఫీసు ప్రకటనను జారీ చేసింది. సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నామని.. మావోయిస్టుల కదలికలు, మత ఘర్షణల ప్రభావం,రాజకీయంగా సున్నితమైన  నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 414 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌, 404 ఎస్‌ఎస్ టీలు, 3,385 మొబైల్‌ టీమ్స్‌ పనిచేస్తున్నాయని తెలిపారు.

పొరుగు రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర దళాల సేవలను వాడుకుంటున్నట్టు చెప్పారు. అనుమానితులను బైండోవర్‌ చేశామని డీజీపీ చెప్పారు. 11,853 మందిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు ఇచ్చామన్నారు. కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి 1,314 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. 17,841 సెక్యూరిటీ కేసులను నమోదు చేయడంతో పాటు 90,128 మందిని బైండోవర్ చేశామని చెప్పారు. 8,481 లైసెన్స్‌ ఆయుధాలను డిపాజిట్‌ చేసుకున్నామని తెలిపిన ఆయన 11 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 39 ఆయుధాల లైసెన్స్ ను రద్దు చేశామని డీజీపీ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates