ఎన్నికలకు భారీ భద్రతా ఏర్పాట్లు


రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 31 జిల్లాల్లోని 119 నియోజకవర్గాల్లో భారీగా బలగాలను మోహరించారు. దాదాపు లక్ష మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టి.. పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత మరింత పెంచారు. భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 414 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు,  404 SOT , 3 వేల 385 పెట్రోలింగ్ టీమ్ లు పనిచేస్తున్నాయి.

ఎన్నికల  నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. 11 వేల 862 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. నిన్నటి వరకు పోలీసులు.. 93 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 కోట్ల 37లక్షల విలువైన 53 వేల లీటర్ల మద్యం సీజ్ చేశారు. వీటితో పాటు 146 గ్రాముల ప్లాటినం, 689 గ్రాముల వజ్రాలు, పదిహేడున్నర కిలోల బంగారం, 121 కిలోల వెండి, 267కిలోల గంజాయి సీజ్ చేశారు. ఇక.. సెక్యూరిటీకి సంబంధించి 17 వేల 882 కేసులు నమోదు చేశారు పోలీసులు. 90 వేల 238 మందిని బైండోవర్ చేశారు. 8 వేల 4 వందల 82 లైసెన్స్ డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు 39 ఆయుధాల లైసెన్స్ రద్దు చేశారు.

లిక్కర్ తో ఓటర్లను ప్రభావితం చేయకుండా చర్యలు తీసుకుటున్నారు అధికారులు. పోలింగ్ సందర్భంగా ఇప్పటికే వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ లు మూతపడ్డాయి. స్టార్ హోటల్ లలో కూడా  లిక్కర్ అమ్మకాలు నిలిపివేయించారు. ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ రాకుండా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాల పోలీసు బలగాలు భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి. సైబరాబాద్ పరిధిలో 152, రాచకొండ పరిధిలో 517 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ కేంద్రాలలో సీసీ కెమెరాలతో పాటు.. వీడియో తీస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates